TS TET: టెట్ నోటిఫికేషన్ ఎప్పుడంటే..

తెలంగాణలో మరో టెట్‌ నిర్వహించాలని ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో నిర్ణయించారు. 

అయితే అధికారికంగా మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. 

టెట్ పరీక్ష నిర్వహణకే 80 రోజుల సమయం పడుతుందని విద్యాశాఖ ప్రతిపాదించింది.

సెప్టెంబరు చివరి వారంలోనే టెట్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. 

రాష్ట్రంలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 9,370 టీచర్ పోస్టులు ఉన్నట్లు విద్యాశాఖ తెలిపింది. 

పదోన్నతులు కల్పించే వరకు 13,684 మంది విద్యా వాలంటీర్లు అవసరం ఉంటుందని విద్యాశాఖ ప్రతిపాదించింది. 

5 వేల మంది మిగులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేసిన తర్వాతే వాలంటీర్లు అవసరమని స్పష్టం చేసింది.