TSPSC Key: టీఎస్పీఎస్సీ కీ(Key) క్యాన్సిల్.. 

టీఎస్పీఎస్సీ నుంచి వివిధ రకాల ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

దీనిలో భాగంగా ఇటీవల AEE పరీక్షలను కూడా నిర్వహించింది. 

ఇంజనీరింగ్ శాఖలలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరీక్షకు సంబంధించి ఫైనల్ కీని ఇటీవల విడదల చేశారు. 

తాజాగా ఫైనల్ కీకి సంబంధించి మరో వెబ్ నోట్ విడుదల చేసింది. 

ఏఈఈ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్షల ఫైనల్ కీ నిలుపుదల చేస్తూ ఈ ప్రకటన విడుదల చేసింది.

ఈఈఈ, మెకానికల్, అగ్రికల్చరల్, సివిల్ ఇంజనీరింగ్ వంటి విభాగాలలో ఖాళీల భర్తీ కోసం మే 8,9,21, 22 వ తేదీలలో పరీక్షలు నిర్వహించారు.