రెచ్చిపోయేందుకు రెడీ

వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా సూపర్ ఫామ్‌లో ఉంది.

ఆడిన 5 మ్యాచ్ ల్లోనూ నెగ్గి 10 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా ఉంది.

ఈ నెల 29న ఇంగ్లండ్‌తో లక్నోలో తలపడనుంది.

ఇక ఇంగ్లండ్ పై వన్డేల్లో విరాట్ కోహ్లీకి సూపర్ రికార్డు ఉంది.

ఇప్పటి వరకు 35 వన్డేలు ఆడిన కోహ్లీ 1,340 పరుగులు చేశాడు.

సగటు 43.22గా ఉంది.

ఇందులో 3 సెంచరీలు.. 9 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం.

ఇక ఈ ప్రపంచకప్ లో కోహ్లీ అదరగొడుతున్నాడు.

ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు బాదాడు.

5 మ్యాచ్ ల్లో 354 పరుగులు చేశాడు.

ప్రస్తుతం టోర్నీ అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.