చన్నీళ్ల స్నానంతో 10 ఆరోగ్య ప్రయోజనాలు

చలికాలంలో చన్నీళ్లతో స్నానం చెయ్యడం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఇది చాలా మంచిది.

చల్లటి నీళ్లతో స్నానం చెయ్యడం వల్ల త్వరగా ముసలితనం రాదని పరిశోధనలు చెబుతున్నాయి.

చల్లటి నీళ్లతో రోజూ స్నానం చేస్తే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.

మెరుగైన సర్క్యులేషన్: చల్లటి నీరు మీ రక్త నాళాలపై ప్రభావం చూపి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

కండరాల నొప్పులు తగ్గుతాయి: చల్లని జల్లులు కండరాల నొప్పి, వాపును తగ్గిస్తాయి. అందుకే అథ్లెట్లు చన్నీళ్లతో స్నానం చేస్తారు.

శక్తి పెరుగుతుంది: చల్లటి నీటి షాక్ అడ్రినలిన్ హార్మోన్‌ను విడుదలయ్యేలా చేస్తుంది. సహజ శక్తి, చురుకుదనం పెరుగుతాయి.

రోగనిరోధక వ్యవస్థ: చల్లని నీరు తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా మీ రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.

చర్మం, జుట్టు ఆరోగ్యం: చల్లటి నీరు రంధ్రాలను బిగించి, నూనె ఉత్పత్తిని తగ్గించి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జుట్టును మెరిసేలా చేస్తుంది. 

ఒత్తిడి తగ్గుతుంది: చల్లని జల్లులు ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇది "ఎక్స్‌పోజర్ థెరపీ"లా పనిచేస్తుంది. 

మెరుగైన శ్వాస: చల్లని నీరు శ్వాస వేగాన్ని పెంచి.. లోతైన, నియంత్రిత శ్వాస పొందేలా చేస్తుంది. ఇది శ్వాసకోశ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

కొవ్వు కరుగుతుంది: చల్లటి నీరు శరీర వేడిని పెంచుతుంది. తద్వారా చెడు కొవ్వు కరిగి, బరువు తగ్గుతారు.