ఈ డైట్ ప్లాన్‌తో అధిక బరువును మర్చిపోతారు!

శీతాకాలం ఫుడ్ ఎక్కువగా తిని, వాటర్ తక్కువ తాగుతాం. అందువల్ల బరువు పెరుగుతాం.

పోషకాల ఆహారం తింటే ఆరోగ్యం. ఫ్యాటీ ఫుడ్ డేంజర్. అందుకే పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్స్) ఉండే ఆహారం తక్కువ తీసుకోవాలి.

గ్రీన్ ఆహారం తినాలి. అంటే గ్రీన్ కలర్‌లో ఉండేవన్న మాట. ఆకుకూరలు, కాయగూరలు వంటివాటిలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి.

గ్రీన్ ఆహారం ఎంత తిన్నా, బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ అంతగా పెరగవు. అందువల్ల డయాబెటిస్ ఉన్నా, ఈ ఆహారం తినొచ్చనిపిస్తుంది.

సీజనల్ ఫ్రూట్స్ అయిన అరటి, జామకాయ, పియర్స్, రేగుపండ్లు, సీతాఫలాలు వంటివి తినాలి. ఆరోగ్యాన్ని పెంచుతాయి.

పప్పులు, బద్దలు, గింజలు, తృణధాన్యాల వంటివి మనకు ఎక్కువ ఆరోగ్యాన్ని అందిస్తున్నాయి. కాబట్టి వాటిని తినాలి. 

నట్స్‌లో వేడి ఎక్కువ. వీటిని తింటే బాడీలో వేడి పెరుగుతుంది. కొవ్వు కరుగుతుంది. గుండెకు కూడా మేలే. 

బాదాం, వాల్‌నట్స్, అవిశె గింజలు, నల్ల నువ్వులు, దోసకాయ గింజల వంటివి తింటే మంచి ఫలితం కనిపిస్తుంది.

సూప్స్ తాగాలి. అవి ఘాటుగా, కాస్త కారంగా ఉంటూ, చలి నుంచీ కాపాడతాయి. అలాగే చెడు కొవ్వును తరిమేస్తాయి.

మన నోరూరించే వాటిలో స్నాక్స్ ఎప్పుడూ డేంజరే. స్నాక్స్ అతిగా తింటే బరువు పెరగడమే కాదు, చెడు కొవ్వు బాడీలో తిష్టవేస్తుంది.

స్నాక్స్ బదులు.. చాట్ మసాలా, క్యారట్ స్టిక్స్, బీట్ రూట్, నిమ్మరసం వంటివి తినాలి, తాగాలి. ఇక ఆరోగ్యమే కదా.