దానిమ్మ తొక్కలతో ఈ ప్రయోజనాలు తెలుసా?

శీతాకాలం సీజనల్ పండ్లలో దానిమ్మ ఒకటి. ఎంతో రుచికరమైన ఈ పండ్లు నచ్చనివారు ఉండరు. వీటి కలర్ కూడా ఆకర్షిస్తుంది.

ఈ పండ్లలో టాన్నిన్స్, ఫ్లేవనాయిడ్స్, ఫెనోలిక్ యాసిడ్స్, డైటరీ ఫైబర్, ఆల్కలాయిడ్స్, మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని పెంచుతాయి.

ఈ పోషకాల కారణంగానే దానిమ్మపండుతోపాటూ, దాని తొక్కలతో కూడా ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు తేల్చారు.

ముఖంపై ముడతలు పోవాలంటే దానిమ్మ తొక్కల పొడిని రోజ్ వాటర్‌లో కలిపి వాడండి. చర్మం మృదువుగా అవుతుంది.

కొబ్బరి నూనె, బాదం నూనె వంటి వాటిలో దానిమ్మ తొక్కల పొడి కలిపి ముఖానికి రాస్తే, సన్‌క్రీన్ లోషన్‌లా పనిచేస్తుంది.

దానిమ్మ తొక్కల పొడిని నీటిలో కలిపి తాగితే, నోటి నుంచి వచ్చే దుర్వాసన పోతుంది.

మహిళలు ఈ తొక్కల్ని ఎండబెట్టి, పొడి చేసి, గ్లాస్ వాటర్‌లో 1 టేబుల్ స్పూన్ వేసి, కలిపి తాగితే, పీరియడ్స్ టైమ్‌లో కడుపు నొప్పి తగ్గుతుంది.

ఈ తొక్కల పొడిలో బెల్లం కలిపి, గ్రైండ్ చేసి, చిన్న ముద్దలుగా చేసి, రోజూ వాడితే, పైల్స్ సమస్య మటుమాయం అవుతుంది.

గొంతులో టాన్సిల్స్ సమస్యలు, గుండె జబ్బులు, ముఖంపై ముడతల సమస్య ఉండేవారు తరచూ దానిమ్మ తొక్కల పొడి వాడటం మేలు.

శరీర చెడు వాసనలు పోయేందుకూ, దగ్గు, బ్లీడింగ్ వంటి వాటికి కూడా దానిమ్మ తొక్కల పొడి బాగా పనిచేస్తుంది.

ఇది సాధారణ సమాచారం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు, సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.