శీతాకాలానికి పర్ఫెక్ట్ డైట్ ప్లాన్

ఎండాకాలం దాహం ఎక్కువగా వేస్తుంది. వాటర్ ఎక్కువ తాగి, ఫుడ్ తక్కువ తీసుకుంటాం. కాబట్టే బరువు పెరగం.

శీతాకాలం రివర్స్. ఫుడ్ ఎక్కువగా తిని, వాటర్ తక్కువగా తాగుతాం. అందువల్ల బరువు పెరుగుతాం.

పోషకాలు ఉండే ఆహారం తింటే, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొవ్వు ఉండే ఆహారం ఎక్కువగా తింటే, రుగ్మతలు తప్పవు.

గ్రీన్ కలర్‌లో ఉండే ఆకుకూరలు, కూరగాయల్లో పిండిపదార్థం తక్కువగా ఉంటుంది. అందువల్ల అవి ఎక్కువగా తినాలి.

ఆకుకూరలు, కూరగాయల వల్ల బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ అంతగా పెరగవు. డయాబెటిస్ ఉంటే, ఈ ఆహారం మేలు.

ఈ సీజన్‌లో అరటి, జామకాయ, పియర్స్, రేగుపండ్లు, సీతాఫలాలు లభిస్తాయి. వాటిని తినాలి.

డయాబెటిస్ ఉంటే, డాక్టర్ సలహాతో ఏ పండ్లు తినవచ్చో అవి తినాలి. సలాడ్ల రూపంలో తీసుకోవడం బెటర్.

పప్పులు, బద్దలు, గింజలు, తృణధాన్యాల వంటివి మనకు ఎక్కువ ఆరోగ్యాన్ని అందిస్తున్నాయి. అవి తినాలి.

పప్పులు, బద్దలు, గింజలు తింటే, బాడీలో వేడి పెరిగి, కొవ్వు కరుగుతుంది. ఇవి గుండెకు కూడా మేలే.

బాదాం, వాల్‌నట్స్, అవిశె గింజలు, నల్ల నువ్వులు, దోసకాయ గింజల వంటివి తింటే ఫలితం కనిపిస్తుంది.

సూప్స్ కాస్త ఘాటుగా, కాస్త కారంగా ఉంటూ చలి నుంచీ కాపాడతాయి. చెడు కొవ్వును కరిగిస్తాయి.

స్నాక్స్ అతిగా తినవద్దు. చాట్ మసాలా, క్యారట్ స్టిక్స్, బీట్ రూట్, నిమ్మరసం వంటివి అప్పుడప్పుడూ తీసుకోవాలి.