మీకు ఇలా అవుతూ ఉంటే, కడుపులో సమస్య ఉన్నట్లే!

పేగుల్లో సమస్య వచ్చినా, ఆహార నాళంలో సమస్య వచ్చినా.. తేలిగ్గా తీసుకోకూడదు. అవి క్రమంగా పెద్ద సమస్యలు కాగలవు.

ఆహార నాళం, పేగుల పట్ల జాగ్రత్తపడాలి. వాటిలో సమస్య వస్తే, కొన్ని సంకేతాలు కనిపిస్తాయి.

చికాకు, దిగులు, బాధ, మూడ్ లేనట్లుగా, దేనిపైనా ఆసక్తి లేనట్లుగా ఉంటే.. దానికీ మీ పొట్టలో సమస్యకీ సంబంధం ఉంటుంది.

ఒత్తిడిగా, వేగంగా మూడ్స్ మారిపోతూ ఉంటే దానికి కారణం మీరు అతిగా తీపి పదార్థాలు, పిండి పదార్థాలు తీసుకోవడమే.

కడుపులో తేడా వస్తే, మన వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ తగ్గిపోగానే జలుబు, దగ్గు తరచూ వస్తూ ఉంటాయి. 

మీకు తరచూ జలుబు, దగ్గు వస్తూ ఉంటే, మీరు చేపలు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.

జీర్ణం కాని ఆహారం కడుపులో గ్యాస్ పుడుతుంది. దాని వల్ల ఛాతి దగ్గర నొప్పి వస్తుంది. గుండె మంటగా ఉంటుంది.

గ్యాస్ ఉంటే, అల్లం టీ తాగొచ్చు లేదా నీటిలో యాపిల్ సైడెర్ వెనిగర్‌ కలిపి తాగడం వల్ల ఫలితం ఉంటుంది.

కడుపు ఉబ్బరంగా అనిపిస్తే, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. వాటిలో ఫైబర్ ఆహారాన్ని బాగా అరిగిస్తుంది.

నోటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటే, కారణం కడుపులో విషపూరిత ఆహారం ఉండటం కావచ్చు. 

ఫైబర్ ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా కడుపులో పేగులు, ఆహార నాళం సమస్యల్ని చాలా వరకు తగ్గించవచ్చు.