టాప్ 10 స్థిరమైన ఆర్థిక వ్యవస్థలు గల దేశాలు.. భారత్ ఎక్కడ?

యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ ఈ జాబితాను తయారుచేసింది.

ఈ లిస్టులో అత్యంత స్థిరమైన ఆర్థిక వ్యవస్థను కలిగిన దేశంగా స్విట్జర్లాండ్ టాప్‌లో నిలిచింది.

స్విట్జర్లాండ్ తర్వాత గల్ఫ్ లోని UAE రెండో స్థానంలో ఉంది.

ఎక్కువగా మంచుతో ఉండే కెనడా మూడో స్థానాన్ని దక్కించుకుంది.

ఆటోమొబైల్ రంగంలో దూసుకెళ్లే జర్మనీ నాలుగో స్థానంలో నిలిచింది.

శ్రమ జీవులు ఎక్కువగా ఉండే జపాన్ ఐదో స్థానాన్ని దక్కించుకుంది.

అద్భుతమైన యూరప్ దేశం స్వీడన్ ఆరో స్థానంలో నిలిచింది.

ఖండం, దేశమైన ఆస్ట్రేలియా ఏడో పొజిషన్ దక్కించుకుంది.

అందమైన దేశం నెదర్లాండ్స్ 8వ స్థానంలో నిలిచింది.

యూరప్ దేశాలైన నార్వే, డెన్మార్క్ 9, 10 స్థానాలు దక్కించుకున్నాయి.

ఈ లిస్టులో 12వ స్థానంలో చైనా నిలవగా, భారత్ 42వ స్థానంలో ఉంది.