ప్రపంచ దేశాల్లో కార్లు ఎంత మందికి ఉన్నాయి? ఇండియాలో పరిస్థితేంటి?

ప్రతి 100 కుటుంబాల్లో ఎంతమందికి సొంత కార్లు ఉన్నాయో ప్యూ రీసెర్చ్ సెంటర్ పరిశోధన చేసింది.

ఇటలీలో అత్యధికంగా 89 శాతం మంది ఇళ్లలో సొంత కారు ఉంది.

ఇటలీ తర్వాత అమెరికాలో 88 శాతం కుటుంబాల వారు సొంత కారు కలిగివున్నారు.

జర్మనీలో ఈ సంఖ్య 85 శాతంగా ఉంది. ఫ్రాన్స్‌లో ఇది 83 శాతంగా ఉంది.

దక్షిణ కొరియాలో 83 శాతం ఇళ్లకు సొంత కారు ఉంది. జపాన్‌లో ఇది 81 శాతంగా ఉంది. 

స్పెయిన్‌లో 79 శాతం, గ్రీస్‌లో 76 శాతం, బ్రిటన్‌లో 74 శాతం కుటుంబాలకు సొంత కారు ఉంది.

ఇజ్రాయెల్‌లో 71 శాతం, పోలాండ్‌లో 64 శాతం, రష్యాలో 55 శాతం ఇళ్లలో సొంత కారు ఉంది.

ఈ సంఖ్య చిలీలో 49 శాతం, బ్రెజిల్‌లో 47 శాతం, అర్జెంటినాలో 43 శాతం, తుర్కియేలో 42 శాతంగా ఉంది.

మెక్సికోలో 35 శాతం, దక్షిణ ఆఫ్రికాలో 31 శాతం, నైజీరియాలో 18 శాతం ఇళ్లలో సొంత కారు ఉంది.

చైనాలో 17 శాతం ఇళ్లలో సొంతకారు ఉండగా.. ఇండియాలో ఇది 6 శాతంగా, పాకిస్థాన్‌లో 3శాతంగా ఉంది.

సొంతకారు కలిగిన ఇళ్ల విషయంలో చైనా, ఇండియా, పాకిస్థాన్ కంటే నైజీరియా ముందుంది.