టూవీలర్స్‌ని ఎక్కువగా వాడుతున్న దేశమేది? భారత్ స్థానం ఎంత?

బైక్ లేదా స్కూటర్‌ని ఏ దేశంలో ఎక్కువగా వాడుతున్నారో ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం చేసింది.

ఈ లిస్టులో థాయిలాండ్ టాప్‌లో ఉంది. అక్కడ 87 శాతం మంది టూవీలర్స్ వాడుతున్నారు.

థాయిలాండ్ తర్వాత 86 శాతంతో వియత్నాం రెండో స్థానంలో ఉంది.

ఇక 85 శాతంతో ఇండొనేసియా మూడో స్థానంలో నిలిచింది.

మలేసియాలో 83 శాతం మంది బైక్ లేదా స్కూటర్ వాడుతున్నారు.

చైనాలో 60 శాతం మందికి బైక్ లేదా స్కూటర్ ఉంది.

ఆరో స్థానంలో భారత్ నిలిచింది. ఇండియాలో 47 శాతం మందికి టూవీలర్ ఉంది.

పక్కనే ఉన్న పాకిస్థాన్‌లో 43 శాతం మంది టూవీలర్స్ వాడుతున్నారు.

టాప్ 7 దేశాలు ఆసియావే. 8వ దేశమైన నైజీరియాలో 35 శాతం మందికి టూవీలర్స్ ఉన్నాయి.

ఇక ఫిలిప్పీన్స్ 32 శాతం, బ్రెజిల్ 29 శాతంతో 9, 10 స్థానాల్లో నిలిచాయి.

ఈ లిస్టును బట్టీ ఆసియాలో టూవీలర్స్‌కి భారీ మార్కెట్ ఉంది. ఆటో కంపెనీలకు ఇది వరమే.