చిలకడ దుంపలతో 6 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

చిలకడ దుంపలు చలికాలంలో లభిస్తాయి. ఇదే వాటి సీజన్. 

చిలకడ దుంపలు తియ్యగా ఉంటాయి. కొంతమంది వాటిని డైరెక్టుగా తింటారు. ఐతే, అలా తింటే కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది.

కొంతమంది ఉడకబెట్టి తింటారు. కొంతమంది కూరల్లో వాడుతారు. తూర్పు ఆసియా దేశాల వారు వీటిని ఎక్కువ ఆసక్తితో తింటారు. 

దుంపల లాగా చిలకడ దుంపలు ఫేమస్ కాలేదు గానీ వీటిలో పోషకాలు చాలా ఎక్కువే.

చిలకడ దుంపల వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.

Rich in Fibre: ఈ దుంపలలో ఫైబర్ కారణంగా త్వరగా ఆకలి వెయ్యదు. తద్వారా అధిక బరువుకి చెక్ పెట్టవచ్చు.

Anti-inflammatory: వీటిలోని A, B, C, D, E, K విటమిన్లు మంటలు, నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

Antioxidant: ఈ దుంపలలోని కెరాటెనాయిడ్స్, మన శరీరంలోని విష వ్యర్థాలను బయటకు పంపేస్తాయి.

Skin Protection: ఈ దుంపలలోని విటమిన్ C, E, మన చర్మ కణాలను అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడతాయి.

Anti-cancer: చిలకడ దుంపలు తినడం వల్ల క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. కారణం వీటిలోని కెరాటెనాయిడ్స్.

డయాబెటిస్ బాధితులకు కూడా ఈ దుంపలు మేలు చేస్తాయి. వీటిని ఏ మోతాదులో వాడాలో డాక్టర్ సూచనలు తీసుకోవాలి.