సెకండ్ హ్యాండ్ కారు కొనేవారికి 5 టిప్స్

కారును పైపై చూసి కొనేయవద్దు. కారు అందం కంటే, ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

Car Condition- కారు సరైన కండీషన్‌లో ఉందో లేదో, అవసరమైతే మీ సొంత మెకానిక్‌తో చెక్ చెయ్యించండి.

కారును డ్రైవ్ చేసి చూడాలి. ఇంజిన్ పనితీరు జాగ్రత్తగా చూడాలి. ప్రతీ యాంగిల్ నుంచి కారును గమనించాలి. 

Maintenance Records- కారు సర్వీస్, మెయింటెనెన్స్‌పై పూర్తి చరిత్రను లోతుగా పరిశీలించాలి.

ఎక్కడ సర్వీసింగ్ చేశారో తెలుసుకోండి. మీరు కొన్నాక కారుకు ఎంతవరకు సర్వీసింగ్ అవసరమో పరిశీలించండి.

Car Insurance- కారుకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ఉందో తప్పక తెలుసుకోండి. ఇది కీలక అంశం.

ఇన్సూరెన్స్ లేకుండా కారు డ్రైవ్ చెయ్యడం అనేది చట్ట విరుద్ధం. అలాంటి కారు కొనడం ప్రమాదకరం.

Test Drive- మొహమాటం లేకుండా కారును టెస్ట్ డ్రైవ్ చెయ్యండి. కొంత ఎక్కువ దూరమే వెళ్లండి.

టెస్ట్ డ్రైవ్ ద్వారా, కారు ఓనర్ చెప్పని చాలా విషయాలు మీకు స్వయంగా తెలుస్తాయి.

RC- కారు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను పూర్తిగా విశ్లేషించండి, ఆన్‌లైన్‌లో దాన్ని పరిశీలించండి.

ఒక్కోసారి RC డూప్లికేట్ ఉండొచ్చు. మీరు కొనే కారు RC నిజమైనదో, కాదో నిర్ధారించుకోండి.