తన పేరునే బ్రాండ్‌గా మార్చేసిన కాస్‌ప్లే డిజైనర్

చైనాకి చెందిన కాస్‌ప్లే డిజైనర్ యాయా హాన్, యానిమేషన్ కేరక్టర్లలో కనిపిస్తూ ఫేమస్ అయ్యారు.

జపనీస్ గ్రాఫిక్స్, యానిమేషన్ ఫీచరింగ్ కేరక్టర్లలో ఆమె ఒదిగిపోతారు.

ఆమె ఫ్యామిలీ జర్మనీకి వెళ్లినప్పుడు, ఆమె తన కాస్‌ప్లే కెరీర్ కోల్పోయారు.

తర్వాత అమెరికా వెళ్లి, సొంతంగా కొత్త లైఫ్ ప్రారంభించారు.

అమెరికాలో కాస్‌ప్లే డిజైనర్లకు ఉన్న క్రేజ్‌ని చక్కగా ఉపయోగించుకున్నారు యాయా హాన్

రూ.3500 పెట్టి, ఓ కుట్టు మిషన్ కొని, సొంతంగా బట్టలు కుట్టడం ప్రారంభించారు.

తాను కుట్టిన బట్టలు ధరించి, కాలిఫోర్నియాలో ప్రదర్శన ఇచ్చి, అందర్నీ ఆకట్టుకున్నారు.

ఆ తర్వాత అలాంటి బట్టలే కావాలని అక్కడి యువత ఆమెను సంప్రదించడం మొదలుపెట్టారు.

అలా ఆమె ఫేమస్ అయ్యారు. తన పేరునే బ్రాండ్‌గా మార్చి, స్టైలిష్ కాస్ట్యూమ్స్ తయారుచేస్తున్నారు.

సాఫ్ట్‌వేర్ ఎనలిస్ట్ జాబ్ వదిలేసి, పూర్తిస్థాయి కాస్‌ప్లే కాస్ట్యూమ్ డిజైనర్‌గా మారిపోయారు యాయా హాన్

ఇప్పుడు యాయా హాన్ డ్రెస్సులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఆమెకు 30 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు.

పట్టుదలతో ప్రయత్నిస్తే, విజయం వరిస్తుంది అనేందుకు యాయా హాన్ ఓ ఉదాహరణగా నిలిచారు.

(All images credit - Facebook - yaya han)