సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన వీటి ధర!

సామాన్యులకు అలర్ట్.. కూరగాయల ధరలు షాకిస్తున్నాయి. 

ప్రస్తుతం మార్కెట్లో ఉల్లిపాయ, టమాటా ధర తక్కువే ఉంది.

కానీ వంకాయ రేటు మాత్రం పరుగులు పెడుతోంది. కొండెక్కి కూర్చుంది.

వంకాయ ధర ఏకంగా సెంచరీ కొట్టింది. దీంతో వంకాయ కొనే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. 

రైతు బజార్లలో కేజీ వంకాయల ధర రూ.90 నుంచి రూ.100 పలుకుతోంది.

ముఖ్యంగా తెల్ల వంకాయ రేటు అయితే రూ.110కు చేరింది.

నల్ల వంకాయ ధర రూ.100 వద్ద ఉంది. 

అంతేకాకుండా కేజీ చక్కని తాజా కాయల దొరకడం వరకూ కష్టమవుతోంది.

సీతమ్మధార రైతు బజార్, అలాగే ఎంవిపి రైతు బజార్లలో ధరలు ఇలా ఉంది. 

పూర్ణ మార్కెట్ వంటి ఓపెన్ మార్కెట్లలో కూడా వంకాయ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. 

ఇటీవల తుఫాన్ నుంచి వంకాయలు సరిగ్గా రావడం లేదని రైతులు అంటున్నారు.