ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా? ఈ టిప్స్ తెలుసుకోండి

పర్యావరణానికి హాని కలిగించని వాహనాలపై ప్రజలు ఇప్పుడు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకుంటున్నారు.

అన్నింటిలోనూ లాభాలూ, నష్టాలు ఉన్నట్లే, ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా లాభనష్టాలు ఉన్నాయని వినియోగదారులు అర్థం చేసుకోవాలి.

ఇప్పుడిప్పుడే ట్రెండ్‌గా మారుతున్న ఎలక్ట్రిక్ వాహనాలు మీకు సెట్ అవుతాయో లేదో తెలుసుకోవాలి.

ధర ప్రకారం చూస్తే, ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో అధిక ధరలకు అమ్ముడవుతున్నాయని గ్రహించాలి. మీ బడ్జెట్‌కు సరిపోయే కారు ఉందో, లేదో పరిశీలించాలి.

బడ్జెట్ పరిమితికి మించి ఎలక్ట్రిక్ కార్లపై ఖర్చు చేయాలని మీరు భావిస్తే, అది మీ కుటుంబ బడ్జెట్‌లో సమస్యలను కలిగిస్తుంది.

వేగాన్ని చూస్తే, సాధారణ పెట్రోల్ లేదా డీజిల్ కార్ల కంటే ఎక్కువ వేగంతో ఎలక్ట్రిక్ కార్లు వెళ్లలేవు.

తరచుగా తక్కువ దూరం మాత్రమే ప్రయాణించే వారైతే, ఎలక్ట్రిక్ కారును ఎంచుకోవచ్చు.

బ్యాటరీ చూస్తే, ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీ లైఫ్ రోజురోజుకు తగ్గిపోతుంది. దీన్ని మార్చేందుకు అదనపు ఖర్చులు అవుతాయి.

ఛార్జింగ్ స్టేషన్లు కూడా మన దేశంలో తక్కువ. ఎలక్ట్రిక్ కార్లకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇంకా అభివృద్ధి చెందలేదు.

ఇతర ఇంధన వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల ధర ఎక్కువ. దీనివల్ల నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి.

గృహ విద్యుత్తును ఉపయోగించి కారుకు ఛార్జింగ్ పెట్టడం మంచి పద్ధతి కాదు. దాని వల్ల కరెంటు బిల్లు బాగా పెరిగిపోతుంది.