ఈ లక్షణాలు కనిపిస్తే కంటి చూపు పోవచ్చు..  జాగ్రత్త

కంటి సమస్యలను సకాలంలో గుర్తిస్తే.. సులువుగా నయం చేసుకోవచ్చు.

కంటి వైద్య నిపుణులు డాక్టర్ మడ్డు వెంకటరమణ కీలక విషయాలను వెల్లడించారు. 

ఎక్కువ మంది అంధులు అవ్వడానికి కారణం గ్లకోమా. ఇది ఏంటో తెలుసుకుందాం.

కంటి చూపు మందగించి కొంత కాలానికి అది పూర్తి అంధత్వం రావడాన్నే గ్లకోమా అంటారు. 

గ్లకోమాలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. ఓపెన్ యాంగిల్ గ్లకోమా, క్లోజ్ యాంగిల్ గ్లకోమా. 

గ్లకోమా వచ్చినప్పుడు ఆ రోగికి కంటి చికిత్స చేయకపోతే ఇది శాశ్వత నష్టం కూడా కలిగిస్తుందని తెలిపారు.

గర్భస్థ శిశువులు మొదలుకుని వృద్ధుల వరకూ కూడా అన్ని వయస్సుల వారిని కూడా బాధిస్తుందని డాక్టర్ తెలిపారు. 

మానవులకి ఒక కంట్లో లేదా ఒకేసారి రెండు కళ్లలోనూ కూడా గ్లకోమా రావొచ్చని డాక్టర్లు చెప్తున్నారు. 

గ్లకోమా ప్రారంభ దశలు కొన్ని సందర్భాల్లో ఎటువంటి లక్షణాలను చూపించవు. 

అయితే సాధారణంగా నెమ్మదిగా దృష్టి కోల్పోవడం, ముఖ్యంగా పెరిఫెరల్‌ విజన్‌లో సమస్య కనిపిస్తుంది.

లైట్ల చుట్టూ కలర్డ్‌ రింగ్ష్‌ కనిపించడం, తరచుగా అద్దాలు మార్చడం, కంటి నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.