సోనియా చూపు ఖమ్మం వైపు..?

Running

సోనియాగాంధీ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయనున్నారు.

Running

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ గతంలోనే తీర్మానం చేసింది.

Running

అధిష్టానం సైతం సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Running

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లాంటి రాష్ట్రాలలో సైతం సానుకూల ప్రభావం ఉంటుందనే అభిప్రాయం.

Running

ఇటీవలే జరిగిన శాసనసభ ఎన్నికల్లోను దీనిపై నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు.

Running

పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా బ్రాండ్‌ను గట్టిగా ఉపయోగించాలన్న చర్చ రాష్ట్ర పార్టీలో వచ్చింది.

Running

ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే సోనియా తెలంగాణ నుంచి పోటీ చేసే అశంపై తీర్మాణం చేశారు.

Running

తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయడానికి ఆమె కూడా అంగీకరించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

Running

ఢిల్లీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో సోనియా పోటీకి సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర నేతలు దృష్టి సారించారు.

Running

రాష్ట్రంలో ఏ పార్లమెంటు బరిలో పోటీకి దింపాలనే విషయంపై ఇటీవల ఎన్నో వార్తలు వినిపించాయి.

Running

ఖమ్మం పార్లమెంట్ బరిలో సోనియాను నిలిపే అవకాశాన్ని రాష్ట్ర నాయకులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.