సీతాఫలం గింజల్ని పొడి చేసి ఇలా వాడుకోండి

సీతాఫలం గింజల పొడితో కొన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అవి తెలుసుకుందాం. 

సీతాఫలం గింజల్ని ముందుగా ఎండ బెట్టాలి. వాటిలో తేమ పోయాక, మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసి, పొడి రెడీ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో కూడా Custard Apple seeds powder పేరుతో ఈ పొడిని అమ్ముతున్నారు. కొనుక్కొని వాడుకోవచ్చు.

ఈ పొడిని 2 రోజుల పాటు చల్లితే చీమలు, బొద్దింకలు, బల్లులు, దోమల సమస్యలు ఉండవు. అన్నీ ఆ ప్రదేశం నుంచి వెళ్లిపోతాయి.

తలలో పేల సమస్య ఉంటే, సీతాఫలం గింజల పొడిని పేస్టులా చేసి, తలకు పట్టించి స్నానం చేస్తే, పేల సమస్య పోతుంది.

గేలానికి ఎరగా ఉపయోగించే ఆహారంలో సీతాఫలం గింజల పొడిని కూడా కలుపుతారు.

సీతాఫలం విత్తనంలో ఒక రకమైన విషం ఉంటుంది. అది చేపలకు అలెర్జీని కలిగిస్తుంది.

సీతాఫలం గింజలు పిండాన్ని కరిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందుకే ఈ విత్తనాలను అబార్షన్ మందులలో ఉపయోగిస్తారు.

గర్భంతో ఉన్న మహిళలు సీతాఫలం గింజలను మింగకుండా జాగ్రత్త పడాలి. లేదంటే గర్భంలోని పిండంకి సమస్య రావచ్చు.

సీతాఫలం గింజల పొడి కళ్లలో పడితే చూపు మందగిస్తుంది. ఈ పొడిని పిల్లలకు దూరంగా ఉంచాలి.

Disclaimer: ఇది సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.