ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌లో 3500 ఉద్యోగాలు..

చాలా మంది సైన్యంలో పని చేయాలనే లక్ష్యంతో నిరీక్షిస్తుంటారు. 

అలాంటి వారికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) గుడ్‌న్యూస్‌ అందించింది. 

అగ్నిపథ్ స్కీమ్ కింద భారీగా అగ్నివీర్స్ రిక్రూట్‌మెంట్ చేపడుతోంది. 

అందుకు సంబంధించి ఇటీవల ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. 

పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

3,500 పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 

అధికారిక పోర్టల్ agnipathvayu.cdac.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. 

జనవరి 17 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది

ఫిబ్రవరి 6న ఈ గడువు ముగుస్తుంది. 

అభ్యర్థుల వయసు 17.5 నుంచి 21 ఏళ్లలోపు ఉండాలి.

పూర్తి వివరాలకు agnipathvayu.cdac.in ఓపెన్ చేయాలి.