అందరికీ గోరింటాకు నల్లగా పండదు. కొన్ని చిట్కాలతో ఇది సాధ్యమే. (image - insta - moly_hennaaceh)
కాస్త రేటు ఎక్కువైనా, బ్రాండెడ్ కోన్లు బాగా పండుతాయి. గోరింటాకును మిక్సీ పట్టి మెత్తగా పేస్టులా చేసుకున్నా పర్వాలేదు. (image - insta - hennography_by_asnour)
చేతులపై గోరింటాకు మనలో టెన్షన్ తగ్గిస్తుంది. నరాలపై బాగా పనిచేసి, తలనొప్పి, జ్వరం వంటి వాటి నుంచి రక్షిస్తుంది. (image - insta - hennography_by_asnour)
హెన్నా వేసుకునే ముందు.. చేతులను శుభ్రంగా కడుక్కొని.. టవల్‌తో పొడి అయ్యేలా తుడుచుకోండి. ఆ తర్వాత హెన్నా అప్లై చెయ్యండి. (image - insta - hennography_by_asnour)
గోరింటాకు వేసుకున్న తర్వాత గంట వరకూ చేతులను అతిగా కదపవద్దు. వాటికి గాలి తగిలేలా ఉండాలి. (image - insta - mayuripotwekar_mehendi)
వేసిన గోరింటాకు 4 గంటల్లో ఆరిపోతుంది. అప్పుడు నిమ్మరసం, పంచదార కలిపిన మిశ్రమాన్ని గోరింటాకుపై చల్లాలి. (image - insta - mayuripotwekar_mehendi)
గోరింటాకును తొలగించడానికి ముందుగా పొడిని చేతులతో తొలగించండి. ఆ తర్వాతే నీటితో కడగండి. (image - insta - hasi.henna)
కడిగిన 12 గంటల తర్వాత గోరింటాకు ఎర్రగా అవుతుంది. మరో 12 గంటల తర్వాత నల్లగా అవుతుంది. (image - insta - hetveegada_mehendi_art)
కొంతమంది గోరింటాకు వేసుకునేముందు యూకలిప్టస్ ఆయిల్‌ని అరచేతులపై రాసుకుంటారు. ఇలా చెయ్యకపోయినా పర్వాలేదు. (image - insta - hennabycikyaa)
గోరింటాకు వేసుకున్న 4 గంటల తర్వాత.. కొన్ని లవంగాలను వేపి.. వచ్చే ఆవిరి ముందు చేతులను అడ్డుగా పెడతారు. మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. బాగా పండుతుంది. (image - insta - moly_hennaaceh)