మంచు కొండల్లో ప్రియమైన వాడితో కాజల్..

టాలీవుడ్ అందాల చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం. 

ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో మరింత పాపులర్. 

 తెలుగులో తాజాగా బాలయ్య సరసన భగవంత్ కేసరిలో నటించింది చందమామ..

ఈ సినిమా దసరాకు విడుదలై బంపర్ హిట్ అయ్యింది..

అది అలా ఉంటే కాజల్ తాజాగా  తన భర్తతో కలిసి స్విట్జర్లాండ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. 

 ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

కాజల్ నటించిన భగవంత్ కేసరి ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.. 

 కాజల్ ప్రస్తుతం ఇండియన్2 మూవీలో నటిస్తుంది. 

డైరెక్టర్ శంకర్ షణ్ముఖం దర్శకత్వం వహిస్తున్నారు. 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది.