ఈ కారు ధర రూ.7.5 కోట్లు

రోల్స్ రాయిస్ తన మొదటి ఆల్-ఎలక్ట్రిక్ వాహనం స్పెక్టర్‌ను ఇండియాలో లాంచ్ చేసింది.

ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.7.5 కోట్లు

దేశంలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు ఇదే.

ఈ కారులో 102kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంది. ఇది 530కిమీల మైలేజీ ఇస్తుంది.

2,890kgల స్పెక్టర్ 4.5 సెకన్లలో 0 నుంచి 100kph వేగం అందుకోగలదని కంపెనీ తెలిపింది. 

ఈ కారుకి 2 ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఇవి 585hp పవర్, 900Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తాయి. 

స్పెక్టర్ గత రోల్స్ రాయిస్ కంటే 30 శాతం దృఢమైనదిగా చెబుతున్నారు.

ఇందులో యాక్టివ్ సస్పెన్షన్, మెరుగైన డ్రైవింగ్ అనుభవం కోసం ఫోర్-వీల్ స్టీరింగ్ ఉంది.

దీనికి పొడవైన బోనెట్, ఫాస్ట్‌బ్యాక్ టెయిల్‌ ఉన్నాయి. ఈ కారు పొడవు 5,475mm, వెడల్పు 2,017mm. 

స్పెక్టర్ లోపల, పైకప్పుతో పాటు, డోర్ ప్యాడ్‌లలో చేర్చిన స్టార్‌లైట్ లైనర్‌తో చాలా అందంగా ఉంది.

ఇంటీరియర్ కస్టమైజేషన్ కోసం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కస్టమర్లు నచ్చిన మార్పులు చేయించుకోవచ్చు.

ఇందులో కొత్త సాఫ్ట్‌వేర్ 'స్పిరిట్'ని పరిచయం చేశారు. 2024 జనవరి 19న బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.