స్టార్ హోటల్ ని తలపించే బంకర్.. 16 కోట్లకే అమ్మకం..

డబ్బు ఉంటే ఎంతటి ప్రమాదాన్నైనా తప్పించుకోవచ్చు. 

ప్రపంచంలో కొన్ని కంపెనీలు బంకర్లను నిర్మిస్తున్నాయి.

వీటిలో ప్రకృతి వైపరీత్యం, అంటువ్యాధి లేదా యుద్ధ సమయంలో సంవత్సరాల పాటు జీవించవచ్చు. 

ఈ బంకర్లలో ఎన్నో విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయి. 

అమెరికాలోని కాన్సాస్ సిటీలో అలాంటి ఓ బంకర్ అమ్మకానికి పెట్టారు. 

దీని తయారీకి రూ.282 కోట్లు ఖర్చు చేయగా, ఇప్పుడు రూ.16 కోట్లకే విక్రయిస్తున్నారు.

10 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ బంకర్‌లో జిమ్, రికార్డింగ్ స్టూడియో, థియేటర్, 10కి పైగా బెడ్ రూమ్ లు ఉన్నాయి. 

1960లో దీనిని 4.5 మిలియన్ డాలర్లతో నిర్మిచారు. 

అంటే నేటి కరెన్సీ ప్రకారం దీని ధర 282 కోట్లతో సమానం. 

ఈ బంకర్ పై అనుబాంబు పేలినా లోపలి వారికి ఏమీ కాదు. 

దీనిలో 80 మందికి పైగా ఏడాదిపాటు ఇక్కడ హాయిగా జీవించ వచ్చు.