గ్రీన్ టీని ఏ సమయంలో తాగాలి? తద్వారా కలిగే లాభాలేంటి?

సాధారణంగా మనకు గ్రీన్ టీ నచ్చదు. చేదుగా ఉందనే భావనతో దూరం పెడుతుంటాం.

భారతీయులకు టీపొడి, పాలు, పంచదారతో చేసే టీ మాత్రమే ఎక్కువగా నచ్చుతుంది.

ప్రస్తుతం భారతీయులు కూడా ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపుతున్నారు. అందుకే మామూలు టీ కంటే, గ్రీన్ టీ తాగాలనుకుంటున్నారు.

గ్రీన్ టీకి సంబంధించిన కొన్ని విషయాలు తెలిస్తే, కచ్చితంగా ఈ టీని మీరు మీ ఆహారంలో చేర్చుకుంటారు.

ఈ రోజు మనం గ్రీన్ టీ తాగడానికి సరైన సమయం, తద్వారా కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.

గ్రీన్ టీ తాగడానికి ఉత్తమ సమయం ఉదయం, మధ్యాహ్నం. ఆహారం తిన్న 2 గంటల తర్వాత గ్రీన్ టీ తీసుకోవచ్చు.

గ్రీన్ టీలో సోడియం, పొటాషియం, జింక్, కాపర్, ప్రొటీన్, ఐరన్, కెఫైన్ వంటి పోషకాలు ఉంటాయి.

గ్రీన్ టీలో పాలీఫెనాల్స్ ఉన్నాయి. ఇవి రక్తంలో షుగర్‌ని కంట్రోల్ చెయ్యడంలో సహాయపడతాయి.

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మ సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి.

గ్రీన్ టీ మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది.

గ్రీన్ టీలో ఇప్పుడు చాలా ఫ్లేవర్లు వచ్చాయి. రకరకాల ఫ్లేవర్లను టేస్ట్ చూడవచ్చు.