జ్యోతిక సూర్య నుంచి దూరం అవ్వడానికి కారణం అదేనా..

ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ ఇటీవలే విడాకులు తీసుకున్నట్లు టాక్ నడిచింది.. 

ఆ తర్వాత అది ఫేక్ న్యూస్ అని తెలిసింది..

దీని తరువాత, తమిళ నటుడు సూర్య, జ్యోతిక మధ్య అంతా బాగా లేదని కోలీవుడ్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి..

దీనికి తోడు ప్రస్తుతం జ్యోతిక ముంబైలో నివసిస్తోంది. ఇటు సూర్య మాత్రం చెన్నైలో ఉంటున్నాడు

ఈక్రమంలో వీరిద్దరి మధ్య విడాకుల వార్త ప్రచారంలోకి వచ్చింది..

 అయితే అలాంటిదేమీ లేదని.. జ్యోతిక తన పిల్లల చదువుల కోసమే ముంబైలో ఉంటుందని మరో టాక్ నడుస్తోంది.. 

అంతేకాదు పెళ్లి తర్వాత జ్యోతిక సినీ పరిశ్రమకు దూరంగా ఉంది. ఇటీవల మళ్లీ మేకప్ వేసుకుంటోంది. ప్రస్తుతం రెండు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది.

అందులో భాగంగానే ఆమె ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది..

షూటింగ్‌కి, పిల్లల చదువులకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.

తమ మధ్య ఎలాంటి వివాదాలు లేవని జ్యోతిక స్పష్టం చేసింది