మ్యాన్ హోల్ మూత ఎందుకు గుండ్రంగా ఉంటుంది.. దానికి ఆ పేరు ఎలా వచ్చింది

మ్యాన్‌హోల్ మూతలు గుండ్రంగా ఉంటాయి, ఎందుకు చతురస్రాకారంలో లేదా త్రిభుజాకారంలో ఉండవు.

లైవ్ సైన్స్ వెబ్‌సైట్ ప్రకారం, మ్యాన్‌హోల్స్ గుండ్రంగా ఉండటం వల్లే.. వాటి మూతలు కూడా అలా ఉంటాయి.

అయితే వీటిని ఎందుకు గుండ్రంగా ఏర్పాటు చేస్తారు అనే ప్రశ్న అందరికీ వస్తుంది.

దీనికి కూడా ఓ బలమైన కారణం ఉంది

ప్రాక్టికల్, ఫంక్షనల్, ఇంజనీరింగ్ మరియు ఆర్థిక నిర్ణయాలు వంటి అనేక అంశాలు మ్యాన్‌హోల్ గుండ్రంగా ఉండటానికి కారణంగా చెప్పుకోవచ్చు.

ప్రాక్టికల్, ఫంక్షనల్, ఇంజనీరింగ్ మరియు ఆర్థిక నిర్ణయాలు వంటి అనేక అంశాలు మ్యాన్‌హోల్ గుండ్రంగా ఉండటానికి కారణంగా చెప్పుకోవచ్చు.

19వ శతాబ్దంలో నగరాల్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థలు నిర్మాణం ప్రారంభమైంది.

అప్పట్లో నగరాల్లో గుంతలు తవ్వడాన్ని ప్రారంభించారు. ఈ రంద్రాల ద్వారా కూలీలు అందులోకి ప్రవేశించేవారు.

పురుషులు మాత్రమే ఈ పని చేసేవారు కాబట్టి ఈ రంధ్రాలను మ్యాన్ హోల్స్ అని పిలిచేవారు.

అంతేకాదు సులభంగా ఇందులో ప్రవేశించడం కోసం.. రంధ్రాలను గుండ్రంగా ఉంచారు.

గుండ్రంగా ఉండటం వల్ల పగుళ్లు, అడ్డంగులు లేకుండా కూలీలు సులబంగా లోపలికి వెళ్లవచ్చు.. బయటకి రావచ్చు అందుకే వాటిని అలా చేశారు.