ప్రపంచ దేశాల్లో ఎక్కువ మంది కలిగిన చివరి పేర్లు ఏవి?

మనలో చాలా మందికి మొదటి పేరు, మధ్య పేరు, చివరి పేరు ఉంటుంది. ఐతే.. చివరి పేరు చాలా మందికి ఒకేలా ఉంటుంది.

ప్రపంచంలో ఏ దేశంలో ఎలాంటి పేరు ఎక్కువగా ఉందో తెలుసుకుందాం.

ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, బ్రిటన్‌లో ఎక్కువ మంది స్మిత్ అనే చివరిపేరును కలిగివుంటారు.

బంగ్లాదేశీయులు అక్తర్ పేరునూ, పాకిస్థానీయులు అహ్మద్ పేరును చివరి పేరుగా పెట్టుకుంటారు.

బ్రెజిల్‌లో డ సిల్వా (Da Silva) ఎక్కువ మందికి చివరిపేరుగా ఉంటుంది.

చైనాలో ఎక్కువ మంది వాంగ్ పేరును లాస్ట్ నేమ్‌గా సెట్ చేసుకుంటారు.

నార్త్ కొరియా, సౌత్ కొరియాలో కిమ్ పేరు ఎక్కువ మందికి చివరి పేరుగా ఉంటుంది.

ఇరాక్, ఈజిఫ్టులో మొహమెద్, UAEలో అలీ, జోర్డాన్‌లో అల్లా పేరు చివరి పేరుగా ఉంటోంది.

రష్యాలో ఇవనోవా, శ్రీలంకలో పెరెరా, ఫ్రాన్స్‌లో మార్టిన్, జర్మనీలో ముల్లర్‌ను లాస్ట్ నేమ్స్‌గా పెట్టుకుంటున్నారు.

సౌదీ అరేబియాలో ఖాన్, జపాన్‌లో శాటో (sato), ఇండొనేసియాలో సారీ (sari) ఎక్కువ మంది చివరి పేర్లుగా ఉన్నాయి.