ఇంట్లో ఈ మొక్కలుంటే సరిసంపదలు ఖాయం

లావెండర్: ఇంట్లో ఇది సానుకూల శక్తిని వెదజల్లుతుంది. ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అందువల్ల బెడ్‌రూమ్, లివింగ్ రూమ్ వద్ద ఈ మొక్కలను ఉంచాలి.

తులసి: తలసి మొక్క ఇంట్లో ఉంటే అక్కడ లక్ష్మి కొలువై ఉంటుంది. ఇంటి లోపల బయట కూడా ఈ మొక్కను పెంచుకోవచ్చు. వంటింటి కిటీకీపైనా ఉంచవచ్చు.

స్నేక్ ప్లాంట్:  ఇది ఫార్మాల్డిహైడ్,  బెంజీన్ వంటి టాక్సిన్‌లను తొలగించడం ద్వారా గాలిని శుద్ధి చేస్తుంది. ఇది ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. పడకగదిలో ఉంచిదే మంచిది.

రోజ్మేరీ:  ప్రతికూల శక్తిని పారద్రోలడానికి  ఈ మొక్క పనికొస్తుంది.  ఉత్పాదకత, ఏకాగ్రతను పెంచడానికి మీ డెస్క్, వర్క్‌స్పేస్‌ వద్ద రోజ్మేరీ కుండీని ఉంచాలి.

పీస్ లిల్లీ: ఇది ఇంట్లో ప్రశాంతత, సామరస్యాన్ని నింపుతుంది. ఎంతో అందమైన తెల్లని పువ్వులు గాలిని శుద్ధి చేస్తాయి. ఇంటి ప్రవేశమార్గం వద్ద ఉంచితే బాగుంటుంది.

సేజ్: సేజ్ మొక్కను ఎంతో కాలంగా ధూపంలో వినియోగిస్తున్నారు. ఐతే ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే సానకూల, ఉత్తేజకరమైన వాతావరణం ఉంటుంది.

జాస్మిన్: జాస్మిన్ సానుకూల శక్తిని ప్రసాదిస్తుంది. ప్రతికూలతను తొలగిస్తుంది. ప్రశాంతమైన నిద్ర, మంచి కలలు రావడానికి ఇంట్లో జాస్మిన్ పూల కుండీ ఉంచాలి.