ఎలుకల బెడద తగ్గించే ఇంటి చిట్కాలు..

మన ఇళ్ల చుట్టూ నివసించే ఎలుకలతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి.

కొన్నిసార్లు వీటి నుంచి రేబిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు రావచ్చు. 

కొన్ని సార్లు వంట గదిలోని సరుకులను నాశనం చేస్తుంటాయి. 

కెమికల్స్ వాడకుండానే ఈ సమస్యకు కిచెన్ ఐటెమ్స్‌తో చెక్ పెట్టవచ్చు.

వాటిని ఇంట్లో పెడితే, ఘాటు వాసనకు ఎలుకలు రావు. ఆ పదార్థాలు ఏంటంటే..

ఉల్లిపాయలు.. ఉల్లిపాయాలు ఘాటైన వాసన వెదజల్లుతాయి. కట్ చేసి, ఇంట్లో వివిధ మూలల్లో పెడితే ఎలుకలు పరార్..

బిర్యానీ ఆకులు.. బిర్యానీ ఆకులు ఎలుకలకు సహజమైన నిరోధకంగా పనిచేస్తాయి. వీటి వాసన వల్ల ఇంట్లోకి ఎలుకలు రావు.

వెల్లుల్లి.. వెల్లుల్లి నుంచి వచ్చే ఘాటైన వాసన ఎలుకలను వికర్షిస్తుంది.

కిరోసిన్ ఆయిల్ కిరోసిన్‌ ఆయిల్ నుంచి వచ్చే ఘాటైన వాసన, ఎలుకలు ఇంట్లోకి రాకుండా నిరోధిస్తుంది.

నల్ల మిరియాలు నల్ల మిరియాల వాసన కొంచెం ఘాటుగా ఉంటుంది. పొడి కొట్టి ఇంట్లోకి ఎలుకలు వచ్చే చోట చల్లుకోవాలి.

లెమన్ గ్రాస్ ఆయిల్ లెమన్ గ్రాస్ ఆయిల్ వాసన కారణంగా ఎలుకలు రావు. లేదా ఆయిల్‌ను ఇంట్లో స్ప్రే చేసినా ఫలితం ఉంటుంది.