ఐపీఎల్ శతక ధీరులు..

ఐపీఎల్ 2024 సీజన్ కోసం సర్వం సిద్ధమైంది.

ఈ ధనాధన్ లీగ్ కు కౌంట్ డౌన్ షురూ..

రికార్డులు బద్దలు కొట్టడానికి బ్యాటర్లు రెడీ..

ఇక, ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు చేసిన హీరోలెవరో ఓ లుక్కేద్దాం.

1) విరాట్ కోహ్లీ.. రికార్డుల రారాజు కోహ్లీ ఖాతాలో ఏడు ఐపీఎల్ సెంచరీలు ఉన్నాయి.

2)క్రిస్ గేల్.. యూనివర్శల్ బాస్ క్రిస్ గేల్ ఆరు సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు.

3)జోస్ బట్లర్.. మాస్ కా బాస్ జోస్ బట్లర్ ఐదు సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు.

4)కేఎల్ రాహుల్.. 4 సెంచరీలతో స్టైలిష్ బ్యాటర్ రాహుల్ కూడా సెంచరీల వీరుల జాబితాలో ఉన్నాడు.

5)షేన్ వాట్సన్.. చెన్నై మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ కూడా నాలుగు సెంచరీలు బాదాడు.

6) డేవిడ్ వార్నర్.. ప్రతి సీజన్ లో సత్తా చాటే డేవిడ్ బాయ్ ఖాతాలో కూడా నాలుగు సెంచరీలు ఉన్నాయి.