పచ్చి బఠాణీలతో 9 ఆరోగ్య ప్రయోజనాలు

పచ్చి బఠాణీలు.. నోటికి రుచినివ్వడమే కాదు.. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చక్కని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

ఒమేగా 3 ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉన్న బఠాణీలను తీసుకోవడం వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.

అల్జీమర్స్, ఆర్థరైటిస్ వంటి జబ్బులు రాకుండా బఠాణీల్లోని పోషకాలు అడ్డుకుంటాయి. ఎముకల్ని కాపాడతాయి.

కొవ్వు శాతం తక్కువగా ఉన్న బఠాణీల్లో ప్రోటీన్, ఫైబర్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వీటిని అధికంగా తీసుకోవాలి.

బఠాణీల్లోని అధికమొత్తంలో ఉన్న ఫైటో న్యూట్రియెంట్స్.. పొట్ట క్యాన్సర్‌ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి.

ఫ్లేవనాయిడ్స్, యాంటీయాక్సిడెంట్స్ కలిగిన బఠాణీలను తినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా తయారవుతుంది.

ఫైబర్ అధికంగా ఉన్న బఠాణీలు తీసుకోవడం వల్ల రక్తసరఫరా సరిగ్గా జరుగుతుంది. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్ రాకుండా ఉంటుంది.

బీ1, బీ2, బీ3, బీ6 విటమిన్స్ కలిగిన బఠాణీలు తీసుకోవడం వల్ల గుండెసమస్యల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.

ఒక కప్పు బఠాణీలు 44శాతం విటమిన్ Kని కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి.

మార్కెట్‌లో ఏడాది మొత్తం దొరికే వేపిన బఠాణీలను కూడా ఇష్టంగా తిని లాభాలు పొందవచ్చు.. బహిరంగ మార్కెట్‌లో కేజీ రూ.80-150కి దొరుకుతున్నాయి.

Disclaimer: ఇది సాధారణ సమాచారం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు, సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.