ప్రస్తుతం భారత్ జనాభా ఎంత?

ప్రపంచ జనాభా 810 కోట్లకు చేరిందని అంచనా. 

వరల్డ్ పాపులేషన్ రివ్యూ, వరల్డోమీటర్ సంస్థలు తాజాగా జనాభాను అంచనా వేశాయి.

ఇండియా జనాభా 143 కోట్లుగా అంచనా. అత్యధిక జనాభా ఉన్న దేశం భారతే.

చైనా జనాభా 142 కోట్లుగా ఆ రెండు సంస్థలూ లెక్కలేశాయి.

అత్యధిక జనాభా గల మూడో దేశంగా ఉన్న అమెరికాలో 34.1 కోట్ల మంది ఉన్నారు.

4వ స్థానంలో ఉన్న ఇండొనేసియాలో 27.9 కోట్ల మంది నివసిస్తున్నారు.

5వ స్థానంలో ఉన్న పాకిస్థాన్‌లో 24.4 కోట్ల మంది ఉంటున్నారు.

6వ స్థానంలో నైజీరియా నిలిచింది. ఇక్కడ 22.7 కోట్ల మంది ఉన్నారు.

21.7 కోట్లతో బ్రెజిల్ 7వ స్థానంలో నిలిచింది.

బంగ్లాదేశ్ 17.4 కోట్ల మందితో 8వ స్థానంలో ఉంది.

రష్యాలో 14.4 కోట్ల మంది ఉండగా.. ఇథియోపియాలో 12.8 కోట్ల మంది నివసిస్తున్నారు.