ఇంట్లో స్ట్రాబెర్రీలను ఎలా పెంచుకోవాలి

స్ట్రాబెర్రీలు రకరకాలుగా ఉంటాయి. అంతేకాదు వీటిని పెంచడంలో కూడా వివిధ మార్గాలుంటాయి. అవేంటో చూద్దాం..

Step 1

మీకు ఎక్కువ కాలం స్ట్రాబెర్రీ సీజన్ కావాలంటే ఎవర్ బేరింగ్ స్ట్రాబెర్రీలను నాటడం మంచిది.

Step 2

ఇక కొన్ని వేలాడే బుట్టలను తీసుకొండి.. వాటిని పెంచాల్సిన ప్రదేశంలో ఉంచండి.

Step 3

వేర్లు బాగా పెరగడానికి మట్టిని బుట్ట దిగువ భాగంలో పోయాలి. మొక్కలకు పోషకాలను అందించడానికి కొన్ని మట్టి ఆధారిత కంపోస్ట్ కలపండి.

Step 4

ఒక పెద్ద టబ్ తీసుకొని దానికి కొంచెం నీరు పొయండి. స్ట్రాబెర్రీ మొక్కలను నీటిలో 30 నిమిషాలు నానబెట్టండి..

Step 5

వేర్లను ఒకదానికొకటి అతుక్కోకండా వేరుచేయండి.. ఇలా చేయడం వల్ల అవి నేల దిగువకు అంటుకోకుండా ఉంటాయి.

Step 6

స్ట్రాబెర్రీ మొక్కల మధ్య ఖాళీ ఉండేలా చూసుకోండి..

Step 7

ఇప్పుడు, స్ట్రాబెర్రీ మొక్కలను బుట్ట అంచు నుండి 1 అంగుళం దిగువన ఉండే విధంగా నాటండి.

Step 8

ఇక చివరగా బుట్టను అంచు వరకు పాటింగ్ మిక్స్‌‌తో నింపడి..