శక్తిమంతమైన సైన్యం ఉన్న టాప్ 10 దేశాలివే!

ప్రపంచంలో మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా కనిపిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైంది. ఈ పరిస్థితుల్లో శక్తిమంతమైన సైన్యం ఉన్న టాప్ 10 దేశాలు ఏవో తెలుసుకుందాం.

మొదటి స్థానంలో అమెరికా నిలిచింది. ప్రపంచంలో మోస్ట్ పవర్‌ఫుల్ మిలిటరీ అమెరికాదే.

మనం ఊహించినట్లుగానే రెండో స్థానంలో రష్యా ఉంది.

మూడో స్థానంలో చైనా నిలిచింది. కొన్నేళ్లుగా డ్రాగన్ దేశం సైన్యాన్ని బలపరుస్తోంది.

4వ స్థానంలో ఇండియా నిలిచింది. భారత సైన్యం నానాటికీ రాటుదేలుతోంది.

5వ స్థానంలో దక్షిణ కొరియా ఉంది. ఉత్తర కొరియా కారణంగా ఈ దేశం తన సైన్యాన్ని పెంచుకుంటోంది.

6వ స్థానంలో బ్రిటన్ నిలిచింది. చెప్పాలంటే ఈ దేశ సైన్యం నానాటికీ డౌన్ అవుతోంది.

7వ స్థానంలో జపాన్ నిలిచింది. శాంతిని కోరుకుంటూ జపాన్ యుద్ధాలకు దూరంగా ఉంటోంది.

8వ స్థానంలో టర్కీ ఉంది. ఈ దేశం కూడా సైలెంటుగా సైన్యాన్ని బలపరుచుకుంటోంది.

9వ స్థానంలో పాకిస్థాన్, 10వ స్థానంలో ఇటలీ ఉన్నాయి. 

ఫ్రాన్స్, బ్రెజిల్, ఇండొనేసియా, ఇరాన్, ఈజిఫ్ట్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, ఉక్రెయిన్, జర్మనీ, స్పెయిన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.