శభాష్.. సోలార్ పవర్‌తో వన్యప్రాణులకు నీరు

గుజరాత్ ప్రభుత్వం వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.

వేసవిలో వాటికి నీటి కొరత సమస్య రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

నీటిని అందించేందుకు కృత్రిమ కొలనులను ఏర్పాటు చేస్తున్నారు.

గిర్ అడవుల్లో 618 వాటర్ పాయింట్లు ఉన్నాయి. 

618లో 541 సహజమైన కొలనులు. వాటిలో ఎప్పుడూ నీరు ఉంటుంది.

అటవీ అధికారులు 163 కృత్రిమ కొలనులను సృష్టించి, నీరు పోస్తున్నారు.

ఈ కొలనుల్లో నీటిని పోసేందుకు సోలార్, విండ్ పవర్‌ని ఉపయోగిస్తున్నారు.

అధికారులు కొలనులతోపాటూ.. మట్టి దిబ్బలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

మట్టి దిబ్బల్లో జంతువులు బురద పూసుకొని ఎండ నుంచి ఉపశమనం పొందుతాయి.

అధికారుల ప్రయత్నంతో గిర్ అడవుల్లో వన్యప్రాణులు, పక్షులూ హాయిగా ఉన్నాయి.

గుజరాత్ ప్రభుత్వ పనితీరుపై పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.