టీ తాగేటప్పుడు వీటిని తినకండి.. విషంతో సమానం!

చాలా మంది ప్రజలకు టీ తాగే అలవాటు ఉంటుంది. 

సాధారణంగా ఒక కప్పు చాయ్ తాగితే మంచి ఎనర్జీ వస్తుంది. 

టీ ఒక ఒత్తిడి నివారణి (Stress reliever) కూడా.

అయితే.. టీ తాగేటప్పుడు కొన్ని ఫుడ్స్ తినకండి.

ఆరోగ్యానికి మంచి కంటే చెడే చేస్తాయి. అవేంటో ఓ లుక్కేద్దాం.

శనగపిండితో చేసిన ఆహారాలు.. టీతో పాటు వీటిని తింటే అజీర్తి సమస్యలు వస్తాయి.

చిప్స్‌.. టీతో పాటు చిప్స్ తింటే కడుపు ఉబ్బరం, ఇన్‌ఫ్లమేషన్ సమస్యలు వస్తాయి. 

కేకులు.. వీటిని చాయ్‌తో పాటు తింటే రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోతుంది. 

ఆకుకూరలతో చేసిన పదార్థాలు.. టీతో పాటు ఆకుకూరలతో చేసిన స్నాక్స్, ఫుడ్స్ తింటే, శరీరానికి అవసరమైన ఐరన్ సరిగ్గా అందదు.

ఫ్రూట్ సలాడ్.. టీలోని టానిన్స్ అనే కెమికల్ కాంపౌండ్, పండ్లలోని పోషకాలు ఒంటబట్టకుండా అడ్డుకుంటుంది.

కార్బోనేటెడ్ డ్రింక్స్.. టీతో పాటు ఈ డ్రింక్స్ తాగకూడదు. డ్రింక్స్‌లో ఉండే ఆమ్లాలు టీ రుచిని పాడు చేస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం.

పసుపు వద్దు.. టీలో పసుపు యాడ్ చేయకూడదు. దీనివల్ల ఎసిడీటీ వంటి డైజెస్టివ్ ప్రాబ్లెమ్స్‌ కొని తెచ్చికున్నట్లే అవుతుంది.