డిగ్రీ అర్హతతో 6030 బ్యాంకు ఉద్యోగాలు..

నిరుద్యోగులకు, బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్‌న్యూస్.

ఇన్‌స్టి‌ట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS), క్లర్క్ పోస్ట్‌ల భర్తీకి భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా దేశంలోని వివిధ బ్యాంకుల్లో భారీ స్థాయిలో 6030 క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్‌లో జులై 21లోపు అప్లై చేసుకోవచ్చు.

క్లర్క్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయసు 20 ఏళ్ల నుంచి 28 ఏళ్లలోపు ఉండాలి.

గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఏదైనా ఫీల్డ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

అన్ రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.850 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

మరిన్ని వివరాల కోసం అధికారిక పోర్టల్ ibps.in విజిట్ చేయాలి.