ఈ పండు సర్వరోగనివారిణి!

ఇంటి పెరట్లో చాలా సులభంగా పెంచుకునే పండ్ల చెట్టు జామ చెట్టు. 

జామ పండ్లు తక్కువ ధరలోనే అందరికీ లభిస్తాయి. 

ఈ అమృత ఫలం అనేక పోషకాలు, ఖనిజాలకు పవర్ హౌస్. 

తరచుగా ఈ పండ్లను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. 

ముఖ్యంగా షుగర్ పేషెంట్లకు ఇది ఎంతో మేలు చేస్తుంది.

రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. 

ఎందుకంటే జామలో ‘లో గ్లైసెమిక్ ఇండెక్స్’ ఉంటుంది. 

బరువు తగ్గాలనుకునే వారు జామ పండు తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది.

జామలోని ఫైబర్ ఆకలి బాధలను నియంత్రిస్తుంది. 

జామలో ఉండే విటమిన్లు, ఖనిజాలు ఆరోగ్యకరమైన జీవక్రియను పెంపొందిస్తాయి. 

రోజూ జామపండు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

జామలో ఉండే యాంటీ యాక్సిడెంట్స్ శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపుతాయి.

గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.