విటమిన్ టాబ్లెట్ వేసుకోడానికి సరైన సమయం ఏదో తెలుసా..?

ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది నిత్యం విటమిన్ ట్యాబ్లెట్స్ వినియోగిస్తుంటారు. ఒక సర్వే ప్రకారం మన దేశంలో ప్రతి 10 మందిలో ఏడుగురు విటమిన్ సప్లిమెంట్లను తీసుకుంటారు. 

ప్రతి విటమిన్ శరీరంలో భిన్నమైన పాత్రను పోషిస్తుంది.. ఇక ఒక విటమిన్ లోపాన్ని వేరేది బర్తీ చేయలేదు.

అయితే విటమిన్ మాత్రలు లేదా సప్లిమెంట్లను తీసుకునే ముందు.. అవి వేసుకోడానికిసరైన సమయం తెలిసుండాలి. 

ఈ కథనంలో విటమిన్ మాత్రలు వేసుకోడానికి సరైన సమయం తెలుసుకుందాం. 

విటమిన్ B12:  ఇది శరీరానికి ఎంతో అవసరమైన పోషకం.. కాబట్టి ఖాళీ కడుపుతో దీనిని తీసుకోవడం ఉత్తమం.

విజమిన్ D: దీనిని ఎప్పుడూ భోజనం తర్వాత తీసకోవాలి. దీనిని పాలతో తీసుకుంటే రెట్టింపు ప్రయోజనం ఉంటుంది. 

ఐరన్ : ఐరన్ మాత్రలు ఖాళీ కడుపుతో తీసుకోవాలంట. ఐరన్, విటమిన్ సి కలిసి తీసుకుంటే ఉత్తమం. 

ఒమేగా-3: దీనిని ఆహారంతో తీసుకోవడం వల్ల పోషకాల శోషణ మెరుగుపడుతుంది. లంచ్ లేదా డిన్నర్ తర్వాత మాత్రమే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోండి.

మల్టీవిటమిన్: శిశువు ఆరోగ్యానికి గర్భిణీ స్త్రీలకు మల్టీవిటమిన్లు అవసరం. ఈ విటమిన్ మాత్రలు భోజనానికి ముందు వేసుకోవాలి.

అన్నిటికంటే ముఖ్యంగా మీరు విటమిన్ టాబ్లెట్స్ వేసుకునే ముందు వైద్యులను సంప్రదించాలి. వారిని అడగకుండా వేసుకుంటే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.