రూ.6,200 ధర తగ్గిన 5జీ మొబైల్. రూ.8,799కి పొందండి

ఇది Lava కంపెనీ తయారుచేసిన Blaze 5G (Glass Green) మొబైల్. ఇది అన్ని 5G బ్రాండ్లనూ సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ 6.5 అంగుళాలు ఉంది. HD+ 90Hz డిస్‌ప్లే కలిగివుంది. అలాగే దీనికి వైడ్‌వైన్ L1 DRM ప్రొటెక్షన్ ఉంది. అలాగే కంటెంట్ మొత్తం హై రిజల్యూషన్‌లో కనిపిస్తుందని తెలిపారు.

దీనికి 4/5 రేటింగ్ ఉంది. గత నెల రోజుల్లో దీన్ని 500 మందికి పైగా కొన్నారు. అంతేకాదు.. దీన్ని కొన్నవారిలో 7,784 మంది రివ్యూలు ఇచ్చారు. రివ్యూల ప్రకారం ఈ మొబైల్ క్వాలిటీ, డబ్బుకి తగిన విలువ, బ్యాటరీ లైఫ్, పెర్ఫార్మెన్స్, లుక్, ఫీచర్స్ బాగున్నాయి. అలాగే సౌండ్ క్వాలిటీ, కనెక్టివిటీ కూడా పర్వాలేదు.

ఈ మొబైల్‌లో ఆక్టా-కోర్ 2.2GHz మీడియా టెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ఉంది. దీనికి 4GB RAM, UFS 2.2 128GB స్టోరేజ్ ఉంది అని తెలిపారు. RAMని 7GB వరకూ పెంచుకునే వీలు ఉంది. అలాగే స్టోరేజ్‌ని 1TB వరకూ పెంచుకోవచ్చని తెలిపారు.

ఇది క్లీన్ ఆండ్రాయిడ్‌ మొబైల్. ఇందులో బ్లోట్‌వేర్ లేదని తెలిపారు. ఇది ఆండ్రాయిడ్ 12 వెర్షన్‌తో పనిచేస్తుంది. అదే 8GB RAM ఉన్న వేరియంట్‌కి మాత్రం ఆండ్రాయిడ్ 13 వెర్షన్ ఉంది. రెండు వెర్షన్ల లోనూ అపరిచితులు కాల్ చేస్తే, ఆ కాల్ ఆటోమేటిక్‌గా రికార్డ్ అవ్వగలదు. 

కెమెరా విషయానికి వస్తే, దీనికి 50MP AI ట్రిపుల్ కెమెరా ఉంది. ఫ్రంట్ వైపు కూడా కెమెరా ఉంది. ఈ మొబైల్‌లో EIS సపోర్టుతో 2K వీడియో రికార్డింగ్ సదుపాయం ఉంది. EIS వల్ల రికార్డింగ్ చేసేటప్పుడు.. దృశ్యాలు షేక్ అవ్వవు. వీడియో రిజల్యూషన్ ‎1600 x 720 ఉంది.

ఈ మొబైల్‌ బ్యాటరీ 5000mAh లిథియం పాలిమర్ బ్యాటరీ. అలాగే ఈ మొబైల్‌కి సైడ్‌న ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ మొబైల్‌ బాక్సులో మీకు మొబైల్‌తోపాటూ పవర్ అడాప్టర్, USB కేబుల్, సిమ్ ట్రే ఎజెక్టర్, ఫోన్ కేస్ ఇస్తున్నారు.

ఈ మొబైల్ 207 గ్రాముల బరువు ఉంది. ఇది బ్లూటూత్, వైఫై, USBతో కనెక్ట్ అవుతుంది. ఈ మొబైల్‌లో 2 సిమ్‌లు పెట్టుకోవచ్చు. హాట్‌స్పాట్ కనెక్షన్ పెట్టుకోవచ్చు. 

దీని అసలు ధర రూ.14,999 కాగా.. అమెజాన్‌లో దీనిపై 41 శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.8,799కి అమ్ముతున్నారు. మీరు EMIలో దీన్ని రూ.427కి పొందవచ్చు.

ఇదే మోడల్‌లో మీకు 6GB RAM, 8GB RAM ఉన్నవి కూడా లభిస్తున్నాయి. వాటి ధరలు వరుసగా రూ.9,099, రూ.9,799గా ఉన్నాయి. మీకు ఒకవేళ ఎక్కువ RAM ఉండాలి అనుకుంటే.. అందుకు తగినది కొనుక్కోవచ్చు. 

ఈ రోజుల్లో 5జీ మొబైల్‌కి 4GB RAM చాలకపోవచ్చు. బెటర్ ఆప్షన్‌గా 6GB RAM ఎంచుకోవడం మేలే. మిగతా ఫీచర్లు అన్ని వేరియంట్లకూ దాదాపు సేమ్ ఉంటాయి.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల అభిప్రాయాలు, అమెజాన్‌‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు. (All Images credit - https://www.amazon.in/Lava-Blaze-5G-Green-Expandable/dp/B0CBRR54KF)