Assistant Professor: పీహెచ్‌డీ అవసరం లేదు..

ఉన్నత విద్యా సంస్థల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించి UGC కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ పోస్టులకు పీహెచ్‌డీ తప్పనిసరి నిబంధనను తొలగించినట్టు వెల్లడించింది.

ఇకపై ఈ పోస్టులకు పీహెచ్‌డీ అవసరం లేదని, ఐచ్ఛికమేనని స్పష్టంచేసింది.

ఈ నిర్ణయం జులై 1 నుంచి అమలులోకి వచ్చినట్టు పేర్కొంది.

2018లో పీహెచ్‌డీని తప్పనిసరి చేస్తూ  యూజీసీ నిబంధనలు జారీ చేసింది.

Fill in some text

తాజాగా ఆ నిబంధనలను యూజీసీ సవరించింది.

ఇకపై అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే పీహెచ్‌డీ డిగ్రీ తప్పనిసరి కాదని తెలిపింది.

ఇక పీహెచ్‌డీ డిగ్రీలేని ఎంతోమంది అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కలగనుంది.