శ్రీ మహావిష్ణువుకి సుదర్శన చక్రం ఎవరు ఇచ్చారో తెలుసా?

హిందూమతంలో దేవుళ్లు, దేవతలకు ప్రత్యేకమైన ఆయుధాలు (Weapon) ఉంటాయి. 

పురాణాల ప్రకారం, శ్రీమహావిష్ణువు సృష్టిని కాపాడే దేవుడు. 

ఆయన ఆయుధం సుదర్శన చక్రం.

ఈ సుదర్శన చక్రానికి విష్ణుమూర్తి 8వ అవతారమైన శ్రీకృష్ణుడితో విడదీయరాని సంబంధం ఉంది. 

అసలు ఈ శక్తివంతమైన సుదర్శన చక్రం విష్ణువు చేతికి ఎలా వచ్చిందో తెలుసా?

పురాణాల ప్రకారం కార్తీక శుక్ల చతుర్దశి నాడు విష్ణుమూర్తి కాశీకి వెళ్లి, శివుడిని పూజించాలని నిర్ణయించుకున్నాడు. 

మణికర్ణిక ఘాట్‌లో స్నానం చేశాక 1000 బంగారు తామర పూలతో శివుడిని పూజించాలి అనుకున్నాడు. 

మణికర్ణిక ఘాట్‌లో స్నానం చేశాక 1000 బంగారు తామర పూలతో శివుడిని పూజించాలి అనుకున్నాడు. 

పూజ ప్రారంభమయ్యాక, విష్ణువు భక్తిని పరీక్షించడానికి శివుడు ఒక తామర పువ్వు కనిపించకుండా చేశాడు. 

పూజ ముగింపులో పద్మం తక్కువగా ఉన్నట్లు గమనించిన విష్ణువు.. తామర పువ్వును పోలిన తన కంటిని వేళ్లతో బయటకు తీస్తాడు.

దాన్ని శివుడికి సమర్పించడానికి సిద్ధమవుతాడు.

దీంతో శివుడు విష్ణువు అచంచల భక్తికి ముగ్ధుడవుతాడు. 

అలానే తన శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని విష్ణువుకు బహుమతిగా ఇచ్చాడు.