ట్రావెల్‌లో వెంట ఈ 7 స్నాక్స్ తీసుకెళ్లండి. ఆరోగ్యకరం

బయట తినే ఆహారం మంచిదో, కాదో చెప్పలేం. పేరున్న రెస్టారెంట్లలో కూడా కల్తీ పెరిగిపోతోంది. కాబట్టి సొంత స్నాక్స్ మేలు.

వెంట తీసుకెళ్లే స్నాక్స్‌తో మీరు ఎంతో ఆరోగ్యంగా ఉండటమే కాదు.. అన్ని పోషకాలూ పొందగలరు.

స్నాక్స్ ఉంటే, ఆకలి వేసినప్పుడు వెంటనే తినవచ్చు. తద్వారా ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా ఉంటాయి. 

వెంట తీసుకెళ్లడానికి అనుకూలంగా ఉండే 7 మంది చిరుతిళ్లు ఏవో తెలుసుకుందాం.

Protein and Granola Bar - ఈ బార్లు వెంటనే ఎనర్జీ ఇస్తాయి. వీటిలోని తృణధాన్యాలు అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని కలిగిస్తాయి.

Trail Mix - నట్స్, గింజలు, డ్రై  ఫ్రూట్స్ అన్ని కలిపి ఈ స్నాక్ తయారుచేసుకోవచ్చు. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉంటాయి.

Fruit Yogurt - మామిడి, బ్లూబెర్రీ వంటి పండ్లను మిక్స్ చేసి, చేసుకునే యోగర్ట్స్‌లో ప్రోటీన్స్, కాల్షియం, విటమిన్స్ బాగా ఉంటాయి.

Roasted Makhana - ఈ లోటస్ గింజలు.. తేలికగా, కరకరలాడుతూ, ఎక్కువ ప్రోటీన్‌తో ఉంటాయి. ఇవి ట్రావెల్‌లో మంచి స్నాక్ అవుతాయి.

Apple with Peanut Butter - యాపిల్స్, పీనట్ బటర్ కలిపి తింటే ఫైబర్ , ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ లభిస్తాయి.

Veggies in Hummus Dip - తాజా కూరగాయలను హమ్మస్‌లో ముంచుకొని తింటే.. కరకరలాడుతూ, విటమిన్స్, ఫైబర్ ఇస్తాయి.

Cookies and Muffins - తృణధాన్యాలతో మీరు స్వయంగా చేసుకునే కుకీలు, మఫ్ఫిన్‌లు తక్కువ షుగర్‌తో ఆరోగ్యాన్ని పెంచుతాయి.