సమ్మర్‌లో మొక్కలను కాపాడే 10 చిట్కాలు

చెట్లలా పెరగని మొక్కలను కుండీలలో పెంచడం మేలు. తద్వారా వాటిని కావాల్సిన చోటికి తరలించవచ్చు.

మొక్కలకు ఎండ అవసరమే కానీ, కొన్ని మొక్కలు ఎండలో ఎండిపోతాయి. అలాంటి వాటిని నీడలో ఉంచాలి.

కుండీలలో మొక్కలకు మనం పోసే నీరే ఆధారం. అందువల్ల ఉదయం, సాయంత్రం వేళ సరిపడా నీరు పొయ్యాలి.

నీరు కుండీలలో నిల్వ ఉంటే, మొక్కల వేర్లు కుళ్లిపోతాయి. అందువల్ల అదనపు నీరు బయటకు పోయేలా చెయ్యాలి.

కొంతమంది వాటర్ బాటిల్స్ ద్వారా.. ఒక్కో చుక్కా పడేలా చేస్తారు. అది కూడా మంచి పద్ధతే. నీరు ఆదా అవుతుంది.

కుండీలలో మట్టిని కనీసం 6 నెలలకు ఓసారి మార్చాలి. కొత్త మట్టిలో వర్మీకంపోస్ట్ కూడా కలిపి మొక్కలు నాటాలి.

మొక్క చిన్నదే అయినా, కుండీ పెద్దగా ఉండాలి. తద్వారా వేర్లు బలంగా పాతుకొని, మొక్క బాగా పెరుగుతుంది.

కుండీలో పైన 10 శాతం వర్మీ కంపోస్ట్ లాంటిది వెయ్యాలి. తద్వారా మట్టిలో తేమ నిలిచి ఉంటుంది. 

బలహీనంగా మారిన మొక్కలకు కొంత ఎరువు అవసరమే. అలాగని మరీ ఎక్కువ వెయ్యకూడదు.

మీరు పెరట్లో మొక్కలు పెంచుతూ ఉంటే.. వాటిపై మరీ ఎక్కువ ఎండ పడకుండా, నీడ కూడా పడేలా చూసుకోవాలి.

మొక్కల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ.. తగిన జాగ్రత్తలు పాటిస్తే, సమ్మర్‌లోనూ అందమైన గార్డెన్ మీ సొంతమవుతుంది.