మృత్యుంజయుడు

డిసెంబర్ 30, 2022.. రిషభ్ పంత్ జీవితాన్ని అతలాకుతలం చేసిన రోజు

ఇంటికి వెళ్తున్న సమయంలో అతడి కారుకు పెను ప్రమాదం

కారు మంటల్లో చిక్కుకోగా.. అందులో ఇరుక్కుపోయిన పంత్ మరణం అంచుల దాకా వెళ్లాడు 

అటుగా వెళ్తున్న ఒక బస్సు డ్రైవర్, క్లీనర్ సాయం చేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

వీపు.. నుదురు భాగాలు కాలిపోగా.. కుడి కాలు తీవ్రంగా గాయపడింది.

లిగ్మెంట్లు దెబ్బతినగా.. 3 సర్జరీల ద్వారా వాటిని బాగు చేశారు.

ఫలితంగా ఏడాది పాటు క్రికెట్ కు దూరమయ్యాడు.

ఈ క్రమంలో పంత్ క్రికెట్ కెరీర్ ముగిసిందంటూ కామెంట్స్ కూడా వినిపించాయి.

అయితే ఇవేమి పట్టించుకోని పంత్ ప్రమాదం నుంచి కోలుకోవడంపై దృష్టి పెట్టాడు.

ఎవరూ ఊహించని రీతిలో వేగంగా కోలుకున్నాడు.

ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా మళ్లీ క్రికెట్ లో రీ ఎంట్రీ ఇచ్చాడు.

ఐపీఎల్ లో అదరగొట్టి టి20 ప్రపంచకప్ కోసం టీమిండియాకు ఎంపికైయ్యాడు.

ఇక బంగ్లాదేశ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో 32 బంతుల్లో 53 పరుగులు చేశాడు.

వార్మప్ మ్యాచ్ లో ఎక్కడా ఇబ్బంది పడలేదు

మృత్యుంజయుడైన పంత్ కు ఆల్ ది బెస్ట్