ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన టాప్ 10 నగరాలు ఇవే..?

10. జపాన్ దేశంలోని ఒసాకా ప్రాంతం 2024లో సుమారు 19 మిలియన్ల జనాభాతో పదో స్థానంలో ఉంది.

9. భారతదేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై 2024లో సుమారు 21.7 మిలియన్ల జనాభాను కలిగి ఉంది. 

8. చైనాలోని బీజింగ్‌లో 2024లో దాదాపు 22.2 మిలియన్ల మంది ప్రజలు నివాసం ఉంటున్నారు.

7. మెక్సికో సిటీ 2024లో సుమారు 22.5 మిలియన్ల జనాభాను కలిగి ఉంది. 

6. ఈజిప్ట్ రాజధాని కైరో సుమారు 22.6 మిలియన్ల జనాభాతో ఆరో స్థానంలో ఉంది.

5. బ్రెజిల్‌లోని అతిపెద్ద నగరమైన సావో పాలో, 2024లో దాదాపు 22.8 మిలియన్ల మంది నివాసితులను కలిగి ఉంది. 

4. బంగ్లాదేశ్ రాజధాని అయిన ఢాకాలో సుమారుగా 23.9 మిలియన్ల జనాభాతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా నిలిచింది.

3. చైనాలోని ఆర్థిక శక్తి కేంద్రమైన షాంఘైలో 2024లో దాదాపు 29.9 మిలియన్ల మంది నివాసితులు ఉన్నారు.

2. భారతదేశ రాజధాని అయిన ఢిల్లీ 2024లో సుమారు 33.8 మిలియన్ల జనాభాతో రెండో స్థానంలో ఉంది.

1. జపాన్‌లోని టోక్యో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరంగా నిలిచింది. 2024లో సుమారుగా 37.1 మిలియన్ల జనాభా ఉంటుంది. 

Source: Worldpopulationreview.com (దీన్ని న్యూస్18 తెలుగు నిర్ధారించలేదు.)