గురుకుల పాఠశాలలో ప్రవేశాలు.. 

గురుకుల పాఠశాలలో ప్రవేశం ఒక్కసారి లభిస్తే చాలు మంచి వాతావరణంలో చదువు అభ్యసించే సువర్ణ అవకాశం లభిస్తుంది.

ఇదే క్రమంలోనే చిన్నారుల తల్లిదండ్రులు ఆలోచించి గురుకుల పాఠశాలల్లో చేర్పించేందుకు ఇష్టపడుతారు.

అందులో కూడా ఇంగ్లీష్ మీడియం అంటే మక్కువుగా ముందుకు అడుగులు వేస్తారు.

ఇందులో ప్రవేశం ఒక్కసారి వరిస్తే చాలు తల్లిదండ్రులకు ఫీజుల భారం కూడా తగ్గుతుంది.

చదివే విద్యార్థికి కూడా ఎటువంటి ఆలోచనలకు లోను కాకుండా చదువు పైనే గురి పెడుతారు.

చిత్తూరు జిల్లాని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 6, 7, 8, 9 తరగతులలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

ఇంగ్లీష్ మీడియంలో బ్యాక్ లాగ్ సీట్లకు ప్రవేశాలకు కొరకు దరఖాస్తులు చేసుకోవాలనన్నారు.

విద్యార్థులు ఈ నెల15వ తేదీ లోపు  https://mjpapbcwreis.apcfss.in వెబ్సైట్ ద్వారా చేసుకోవాలి.

వివరాలకు సదుం- 90003 17307, పులిచర్ల, 74162 81148,పెద్దపంజాని 95157 64818, కుప్పం -76809 85898 నెంబర్లుకు సంప్రదించవచ్చు.