బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా?

ఈ రోజుల్లో అపోహలను నమ్ముతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 

ఇటీవల కిడ్నీ స్టోన్స్ సమస్యకు సంబంధించి ఒక పుకారు వైరల్ అవుతోంది. 

బీర్ తాగితే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయని కొందరు ప్రచారం చేస్తున్నారు. 

ఈ వాదనలో నిజం ఉందా? లేదో ఇక్కడ తెలుసుకుందాం?

ఇటీవల కాలంలో చాలామంది కిడ్నీల్లో రాళ్లతో ఇబ్బంది పడుతున్నారు. 

సాధారణంగా వాటర్ ఎక్కువగా తాగితే, కిడ్నీల్లో చిన్న సైజులో ఉన్న రాళ్లు మూత్రంతో కలిసి బయటకు పోతాయి. 

అయితే బీర్ తాగితే మూత్రం ఎక్కువగా వస్తుంది కాబట్టి, కిడ్నీ స్టోన్స్ పోతాయనే వాదన ఉంది.

కానీ ఇది పెద్ద అపోహ అంటున్నారు డాక్టర్లు. 

ఇలాంటి అపోహలు నమ్మితే చాలా ప్రమాదాలు ఉంటాయని చెప్పారు. 

ముఖ్యంగా బీర్లు ఎక్కువగా తాగితే అనేక దుష్ప్రభావాలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు.