అధిక బరువు ఉంటే ఆ విషయంలో కష్టమే..!

మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా బరువు పెరగడం, పొట్ట ఎక్కువగా పెరగడం సహజం. 

దీనికి తోడు వర్కౌట్ చేయకపోవడంతో చాలా మంది బరువు పెరుగుతున్నారు. 

అయితే బరువు పెరగడం శృంగార జీవితానికి మంచిదా, చెడ్డదా ఇప్పుడు తెలుసుకుందాం. 

నిజానికి శరీరంలో నిల్వ చేయబడిన అదనపు కేలరీలే మీరు బరువు పెరగడానికి కారణమవుతాయి. 

బరువు పెరగడం వల్ల మీ బాడీ షేప్ మారడమే కాకుండా మీ  లైంగిక జీవితం కూడా ప్రభావితం అవుతుంది. 

బరువు వల్ల మగవారు, ఆడవాళ్ల శరీరంలో లిబిడో తగ్గుతుంది. దీంతో శృంగార కోరికలు తగ్గుతాయి.

హార్మోన్ల అసమతుల్యత కారణంగా టైప్ 2 డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి డేంజర్ సమస్యలొచ్చే ప్రమాదం కూడా ఉంది. 

ఊబకాయంతో లైంగిక ఆనందం, ఉద్వేగాన్ని చేరుకోవడం కష్టం. 

ముఖ్యంగా మహిళల్లో లైంగిక ఆనందం, లైంగిక పనితీరు వంటి సమస్యలు వస్తాయి. 

కొందరు శృంగారానికి దూరంగా ఉండాలని భావిస్తారు. దీంతో కుటుంబంలో చికాకులు మొదలవుతాయి.

అందుకే అధిక బరువు ఉన్నవారు వెంటనే డైట్ చేయాలని నిపుణులు చెపుతున్నారు.